వైసీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ...గతంలో పాలకులెవరూ ఎప్పుడూ సామాజిక న్యాయం అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. జగనన్న హయాంలోనే సామాజిక న్యాయమన్నది చూస్తున్నాం. మన అనంతపురం జిల్లావరకు చూసుకున్నా, ఇక్కడ బీసీ మంత్రులున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్, మేయర్‌లున్నారు. కార్పొరేషన్లలోనూ బడుగు, బలహీనవర్గాలకే పెద్దపీట వేశారు జగనన్న. ఈ నియోజకవర్గంలో టీడీపీ రాజకీయం చూస్తే అసహ్యమేస్తుంది. పేదలకు, అణగారిన వర్గాలకు చేసే ప్రతి మంచి పనికీ అడ్డుపడుతోంది. ఆ టీడీపీ నాయకులెవరో మీకు తెలుసు. టీడీపీ పైస్థాయిలో ఎలా దోచుకో...దాచుకో సిద్ధాంతాన్ని అనుసరిస్తోందో..అదే తరహాలో ఇక్కడ పచ్చ సోదరులు పనిచేస్తున్నారు. తాడిపత్రిలో వారి అరాచకాలకు అంతులేదు. జగనన్న ఆదర్శాలు, ఆలోచనల కనుగుణంగా నేను ముందుకు సాగుతున్నాను. బడుగు, బలహీనవర్గాలకు అండాదండగా ఉండటం మన పార్టీ సిద్ధాంతం. సామాజిక న్యాయం మన పార్టీ శ్వాస. సామాజిక సాధికారతే మన పార్టీ ధ్యాస. జగనన్న బాటలోనే మనమంతా అని అన్నారు.
![]() |
![]() |