ఎచ్చెర్ల సామాజిక సాధికార యాత్రకు వచ్చిన జనమే టీడీపీకి హెచ్చరికలు జారీ చేస్తుందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ప్రజలే జగన్ బలం, ఆయనే అందరికీ ఆత్మబలం అని పిలుపునిచ్చారు. కులం,మతం,రాజకీయం వర్గాలు లేకుండా అందరికీ మేలు చేయడానికే జగన్ నాలుగున్నరేళ్లగా పరితపిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ఏ వర్గానికి గుర్తింపు లేకుండా పోయిందని, గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వకపోతే, జగన్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారన్నారు. 65 ఏళ్లకు చంద్రబాబు పెన్షన్ ఇస్తే, 60 ఏళ్లకే జగన్ పింఛన్ ఇస్తున్నారని, ఐదెకరాలు భూమి ఉన్నా బాబు పెన్షన్ తీసేసారని, జగన్ మాత్రం అటువంటి ఆంక్షలు లేకుండా అర్హులైనవారందరికీ లబ్ధి చేకూర్చారని, అది జగన్ మానవత్వానికి నిదర్శనమన్నారు. చేయి చేయి కలిపి ఏకమై జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.