టీమిండియాతోపాటు ఆస్ర్టేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లకు చెందిన మాజీ క్రికెటర్లతో కూడిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లకు విశాఖ ఆతిథ్యమివ్వనుంది. పీఎంపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో డిసెంబరు రెండు నుంచి నాలుగు వరకు జరిగే ఈ టోర్నీలో ఐదు జట్లు తలపడనున్నాయి. గౌతమ్ గంభీర్ (ఇండియా క్యాపిటల్స్), హర్భజన్‌సింగ్ (మణిపాల్ టైగర్స్), సురేష్ రైనా (అర్బన్ రైజర్స్ హైదరాబాద్), పార్ధీవ్ పటేల్ (గుజరాత్ గైండ్స్), ఆరన్ పించ్ (సదరన్ సూపర్‌స్టార్స్) సారథులుగా వ్యవహరించనున్నారు. డిసెంబరు 2న ఇండియా క్యాపిటల్, మణిపాల్ టైగర్స్, డిసెంబరు 3న గుజరాత్ గైండ్స్, సదరన్ సూపర్‌స్టార్స్, 4న మణిపాల్ టైగర్స్, అర్బన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి.