వేగంగా వస్తున్న కారు నలుగురిని ఢీకొట్టి ఇద్దరు మృతి చెంది, ఆపై చెట్టును ఢీకొన్న ఘటన ఉత్తరప్రదేశ్లో మంగళవారం జరిగింది.సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూద్నాథ్ దేవాలయం సమీపంలో గోండా-అయోధ్య హైవేపై ఈ ప్రమాదం జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ శివరాజ్ తెలిపారు. జన్నత్ (50), మహ్మద్ నీమ్ (55) అక్కడికక్కడే మృతి చెందగా, మహ్మద్ ఇషాక్, షఫీకునిషా గాయపడ్డారని తెలిపారు. వేగంగా వచ్చిన కారు మొదట వారిని ఢీకొట్టి, ఆపై చెట్టును ఢీకొట్టిందని, కారు డ్రైవర్ను పట్టుకునేందుకు అన్వేషణ ప్రారంభించామని అధికారి తెలిపారు.