నాసిరకం మద్యాన్ని పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన జగన్.. మద్యం అమ్మకాలను మరింత పెంచారని దుయ్యబట్టారు. మద్యం అమ్మకాల డబ్బును ప్యాలెస్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశారని... మద్యం ధరలను కూడా పెంచారని విమర్శించారు. ఇసుక దొరక్క లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని దోచుకున్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు. టీటీడీలో తన బంధువులను నియమించుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సామాజిక న్యాయం అంటే సొంత వర్గానికి న్యాయం చేయడమా జగన్? అని ఆయన ప్రశ్నించారు.