పెద్ద చెర్లోపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దగ్గుమాటి బలరామ రెడ్డి ఆధ్వర్యంలోమంగళవారం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. కనిగిరి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణ మాట్లాడుతూ మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకై అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.