డిసెంబర్ 4న రాప్తాడులో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర నాలుగో తేదీ నియోజకవర్గంలో పర్యటిస్తుందని, బస్సు యాత్ర ద్వారా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. నియోజవర్గంలో ఇప్పటివరకు పది వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఆ విషయాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు.