పెనుకొండ మండలం మావటూరు గ్రామ పంచాయతీలో జగనన్నే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సచివాలయం పరిధిలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, నాయకులు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ శివయ్య, మండల కన్వీనర్ నాగులూరు బాబు, ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.