జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు జగనన్న విద్య, వసతి దీవెనకు డిసెంబర్ 31 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా నోడల్ అధికారి లక్ష్మానాయక్ మంగళవారం తెలిపారు. విద్యార్థులు జ్ఞానభూమి వెబ్సైట్ లో దరఖాస్తులను సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు విషయాన్ని తెలపాలన్నారు.