విద్యార్థినులు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న రంగంలో రాణించి చరిత్ర సృష్టించాలని రాష్ట్ర మంత్రి ఆర్కె. రోజా పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో మంగళవారం వార్షిక పూర్వవిద్యార్థినుల సమ్మేళనం జరిగింది. మంత్రి ఆర్కె. రోజా విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ కళాశాలలో చదువుకోవడం విద్యార్థినుల పూర్వజన్మ సుకృతమన్నారు.