వైసీపీ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిందని, తిరిగి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు. నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి ప్రజలకు వివరించారు. కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ .... తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపితే సైకో జగనన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అరాచకాలు, అక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa