ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోటిఫకేషన్ లేకుండా పోస్టుల భర్తీ చేస్తున్నారంటూ ఆరోపణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 04:00 PM

 ఆంధ్ర యూనివర్సిటీలో నిధుల మళ్లింపుతో పాటు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని వీసీ ప్రసాద్ రెడ్డి తదితరులపై విచారణ జరిపించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. నోటిఫకేషన్ లేకుండా పోస్టుల భర్తీ చేపట్టారని యూనివర్సిటీల పరిధిలో ఉన్న కాలేజీల్లో అక్రమ నియామకాలు చేపట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. గవర్నర్ తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. విచారణను ఎనిమిది వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com