టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు (బుధవారం) ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి 212వ రోజు పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..... జగన్మోహన్ రెడ్డికి మోసం చేయడం, దోచుకోవడం తప్ప ఏమీ తెలియదని విమర్శించారు. మహిళలు దాచుకున్న రూ.2500 కోట్లు దోచుకున్న గజదొంగ జగన్ అని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా మహిళలకు అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక చేయూతనిచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్థిక తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. పాడైపోయిన రోడ్లను బాగుచేయించి రాకపోకలకు ఇబ్బందిలేకుండా చేస్తామని తెలిపారు. రాష్ట్ర యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మహిళలు, యువత రక్షణకు కల్పించే చర్యలను విస్తృతంగా చేపడతామని లోకేష్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa