విశాఖ నగరంలోని కంచరపాలెం గాజువాక పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 30 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
వీరందరినీ బుధవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 2లక్షల జరిమానాతో పాటు కంచరపాలెం స్టేషన్లో పట్టుబడిన ఇద్దరికి 8 రోజులు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కమిషనర్ రవిశంకర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa