దేశంలో ఏ ఒక్కరూ సాధించలేని విజయాన్ని గత ఎన్నికల్లో సాధించిన ఒకే ఒక్కడు జగన్ అని, ప్రజలు ఇచ్చిన అండదండలతో ముఖ్యమంత్రిగా పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారని పార్వతీపుం మన్యం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు అన్నారు. కురుపాం నియోజకవర్గంలో మరోసారి పుష్పశ్రీవాణిని గెలిపించి ఈ ప్రాంతాన్ని వైయస్ఆర్సీపీ కంచుకోటగా నిలపాలని పిలుపునిచ్చారు.