14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చేయలేని సామాజిక సాధికారతను తొలి సారి ముఖ్యమంత్రైన నాలుగున్నరేళ్లలోనే జగన్ చేసి చూపించాలని కురుపాం ఎమ్మల్యే పుష్పశ్రీ వాణి అన్నారు . రాష్ట్రానికి చిట్టచివరన ఉన్న కురుపాం నియోజకవర్గానికి చెందిన, గిరిజన వర్గానికి చెందిన తనను రాష్ట్రానికి తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిని చేసి సీఎం జగన్ తన ఆలోచనలు ఏంటో చాటి చెప్పారని వెల్లడించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో చంద్రబాబు హయాంలో కనీస అభివృద్ధికి నోచుకోలేదని, జగన్ సీఎం కాక ముందు ఇక్కడ పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ స్థాయిలో ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నది ప్రజలే గమనించాలని పిలుపునిచ్చారు. జేఎన్టీయూ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించిన ఘనత జగన్ దేనని, త్వరలో ప్రభుత్వ మహిళా కాలేజీని స్థాపించబోయేది కూడా ఆయననే వివరించారు. కురుపాం నియోజకవర్గంలో జగన్ హయాంలో జరిగిన అబివృద్ధి, సంక్షేమం, గతంలో ఎన్నడైనా జరిగిందా అన్న అంశంపై ప్రతిపక్షాలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. గిరిజనులకు జగన్ ఎక్కువ మేలు చేసారా, బాబు చేసాడా అన్నది ప్రజలందరికీ తెలుసునన్నారు. హామీలిచ్చి మోసం చేసిన మోసగాడు చంద్రబాబు అయితే, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన మొనగాడు జగన్ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఈ తూర్పు కనుమల్లో వైయస్సార్ సీపీ జెండా జయకేతనం ఎగురవేయడం ఖాయమని ఉద్ఘాటించారు.