చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ. 4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ యూనిట్‌ను ఏర్పాటుచేయనున్న పెప్పర్ మోషన్, అతి త్వరలో భూమిపూజకు సిద్దమవుతున్న కంపెనీ. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్ధ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్, ప్రతినిధి బృందం కలిసింది.గ్రీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, పారదర్శక విధానాలపై పెప్పర్ మోషన్ ప్రతినిధులతో చర్చించిన సీఎం వైఎస్ జగన్. ఏడాదికి 30,000 ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు తయారీ సామర్ధ్యం, ఇంటిగ్రేటెడ్ వర్టికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఏర్పాటుచేయనున్న పెప్పర్ మోషన్, 20 జీడబ్ల్యూహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీల నుంచి ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్ ఏర్పాటు, డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్, 20 జీడబ్ల్యూహెచ్ సామర్ధ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుచేయనున్నట్లు సీఎంకి తెలిపిన పెప్పర్ మోషన్ సీఈవో. జర్మనీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన పెప్పర్ మోషన్ యూరప్, యూఎస్‌ఏ, మెక్సికో, చైనాలో విస్తరణ, లీడింగ్ గ్లోబల్ కార్పొరేషన్స్‌తో పార్ట్‌నర్‌షిప్. ఏపీలో ఏర్పాటుచేస్తున్న యూనిట్‌కు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం, ప్రభుత్వ సహకారంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన పెప్పర్ మోషన్ సీఈవో, ఏపీలో ఏర్పాటుచేస్తున్న గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాల్లోని పెప్పర్ భాగస్వామ్యులకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందించనున్నారు .