రూ.1600 కోట్లు విలువ చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను కురుపాం నియోజకవర్గ పరిధిలో చేపట్టామని, అభివృద్ధిపై చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీకి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి సవాల్ చేస్తున్నా సరే..... ముందుకు రాకుండా తోక ముడుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. గతంలో చెప్పిన పనులు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు కొత్త హామీలు ఇస్తూ ముందుకు వస్తున్నారని, అవి నమ్మితే ప్రజలు నట్టేట మునిగినట్లేనని హెచ్చరించారు. రూ. 87,600 కోట్లకు రైతు రుణ మాఫీ అని చెప్పి కేవలం 14 వేల కోట్లు మాత్రమే చంద్రబాబు మాఫీ చేసి మోసాడని, ఇదే రీతిలో డ్వాక్రా మహిళలను ముంచాడని వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులతో మాయగాళ్లు వస్తున్నారని, గత మోసాలు గుర్తు చేసుకో.... ఫ్యాన్ గుర్తుకు ఓటేసుకోవాలని రాజన్నదొర పిలుపునిచ్చారు ఏం పిల్లడో ఎల్దం వస్తావా అనే జానపదాన్ని వేదికపై రాజన్నదొర పాడి ఉత్సాహ పరిచారు.