రాష్ట్రంలో ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు, ఆనందం చూడాలనే ఆలోచనలతో పుట్టిందే వైఎస్సార్ సీపీ ఆని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసారని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా మహిళలకు, రైతుల రుణాలము మాఫీ చేయడంతో పాటుగా స్కూల్ పిల్లల తల్లులకు అమ్మఒడి పేరుతో డబ్బును ఖాతాలో జమ చేస్తున్నారని, అలాగే వృద్ధులకు పెన్షన్ మొత్తాన్ని రూ. 2750 పెంపు చేసారని, రానున్న జనవరి నుంచి రూ. 3 వేల రూపాయులు అందజేయనున్నారన్నారు. నాడు - నేడు పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంగ్లీషు మీడియంలో బోధన చేయడంతో పాటుగా అత్యాధునిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చి దిద్దారని గుర్తు చేసారు. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని వెల్లడించారు. పేదల కోసం ప్రతిక్షణం పరితపిస్తున్న నేత జగన్ మాత్రమేనని గుర్తు చేసారు.