వైసీపీ చేపట్టిన సామజిక యాత్రలో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ... మైనార్టీల బాగోగులు చంద్రబాబు చూసుకోలేదు. వైయస్సార్ సీఎం అయిన తర్వాత ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఈరోజు మైనార్టీల పిల్లలు మచిలీపట్నం నుంచి ఆస్ట్రేలియా, దుబాయ్ దాకా వెళ్లి కోటీశ్వరులయ్యారు. అందుకు కారణం వైయస్సార్. చంద్రబాబు సీఎం అయ్యాక మైనారిటీలకు మంత్రి కూడా ఇవ్వలేదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత నేడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు పదవులిచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసే నాయకుడు మన జగనన్న. పేదల పార్టీ, మనందరి పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. పేదల పక్షపాతి జగనన్న. పథకాల కోసం ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్, మున్సిపాల్టీ ఆఫీసులకు వెళ్లి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. వాలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే ఇస్తున్నారు. మా పిల్లలకు స్కూల్లో యూనిఫాం, బ్యాగు, బుక్స్ , జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి, కాలేజీకి వెళ్తే విద్యా దీవెన, వసతి దీవెన, ఆపై చదువులకు విదేశీ విద్యాదీవెన ద్వారా ఆదుకుంటున్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి విద్యే అంటున్న జగనన్న. ఆరోగ్యశ్రీ పరిధిలో 3 వేలకుపైగా చికిత్సలను యాడ్ చేశారు. వైద్యం కోసం విజయవాడకు వెళ్లాల్సిన పని లేకుండా మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ తెచ్చారు. టీడీపీ ఎందుకు చేయలేకపోయింది. మహిళా సాధికారత వైయస్సార్‌సీపీ మాత్రమే చేయగలిగింది. మనకు న్యాయం చేసే నాయకుడు జగనన్న. అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు. రూ.2.36 లక్షల కోట్లు రూపాయి లంచం లేకుండా నేరుగా ఇంటికే ఇచ్చిన జగనన్న. చంద్రబాబు మీకు ఇవ్వాల్సిన డబ్బులు తినేశాడు. మైనార్టీలకు నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన జగనన్న. రూ.26 వేల కోట్లు ఒక్క మైనార్టీ సామాజిక వర్గానికే ఇచ్చిన ఘనత జగనన్నది. ఇమామ్, మౌజమ్‌లకు సాయం చేస్తున్న ప్రభుత్వం మనది. మచిలీపట్నానికి పోర్టు, ఫిషింగ్ హార్బర్‌తో ఈ ప్రాంతంలో ఉపాధి వచ్చింది అని తెలిపారు.