బీసీలను గుండెల్లో పెట్టుకున్న జగనన్న. మంత్రి పదవులు, రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి అన్ని పదవులలో 50 శాతానికిపైగా ఇచ్చారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బీసీలకు మంత్రిపదవులిస్తే ఆ పదవులను జీరోలుగా చెబుతున్న టీడీపీ నేతలు. సున్నాల పక్కన ఒకటి నుంచి కోటి దాకా విలువతెచ్చిన నాయకుడు జగనన్న. ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసుకొని బతికేలా చేసిన జగనన్న. వెయ్యి మందికో, 10 వేల మందికో ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇచ్చి చేతులు దులుపుకున్న టీడీపీ. వైయస్సార్ చేయూత ద్వారా రూ.18 వేలు చొప్పున ఏటా 50 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మేలు చేస్తున్న జగనన్న. నేను మీకు మంచి చేస్తేనే ఓటు వేయాలని చెప్పే దమ్మున్న నాయకుడు జగనన్న మాత్రమే. మత్స్యకారులను తోలుతీస్తానని చంద్రబాబు అంటే, అదే సామాజిక వర్గాన్ని జగనన్న రాజ్యసభకు పంపారు. మత్స్యకారులకు మేలు చేస్తూ 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్న సీఎం జగనన్న. విశాఖలో బోట్లు కాలిపోతే నాలుగు రోజుల్లోనే ఆదుకున్న సీఎం జగన్. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల్లోని మహిళలు మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు. మంచి చేసిన జగనన్న 2024లో ఎన్నికలకు వస్తున్నాడు. ఒక్క అడుగు మనతో వేయించాడు. 2024లో మళ్లీ జగనన్నను గెలిపించుకుందాం. 10 అడుగులు ముందుకేద్దాం. రాబోయే ఎన్నికలు బలిసిన వాడికి, బక్కచిక్కినోడికి మధ్య జరిగేవి. బలిసిన వాడి పక్కన చంద్రబాబు, బక్కచిక్కిన వాడి పక్కన జగనన్న ఉన్నాడు. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నెల్లూరు జిల్లాలో బీసీనైన నన్ను తొలిసారి మంత్రిగా చేసిన ఘనత జగనన్నది. గొర్రెలు కాచుకొనేవాళ్లకు మంత్రి పదవిచ్చారని టీడీపీ వాళ్లు విమర్శించారు. శ్రీకృష్ణపరమాత్ముడు గొర్రెలు కాచినవాడే. ఏసు ప్రభువు గొడ్లు కాచుకొనే చావడిలో పుట్టాడు. మాలాంటి వాళ్లు గొర్రెలు, బర్రెలు కాచుకొని పాలు పితికితేనే రూ.20 వేల కోట్లు భువనేశ్వరి కంపెనీకి వచ్చాయి అని ఆరోపించారు.