5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని అంటున్నారు. మిజోరంలో స్థానిక పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంటున్నారు. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీకి అధికార పీఠం దక్కే అవకాశం ఉందని అంటున్నారు.
మిజోరం విషయానికి వస్తే జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్‌పిఎం), మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) మధ్య గట్టి పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపలేవని స్పష్టం చేశారు.