‘‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’’ కార్యక్రమం పేరుతో డోర్ టు డోర్ వెళ్లిన మహిళా కార్యకర్త ఓటీపీ అడిగిందని ఓ ఇంటి యజమానురాలు చేసిన డైల్ 100 కాల్‌పై పోలీసులు స్పందించారు. సదరు మహిళపై విచారణ చేసారు. జరిగిన ఉదంతంపై టీడీపీ ఇన్చార్జ్ గండి బాబ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఒంటిరిగా మహిళను రాత్రి 9 వరకూ పోలీస్టేషన్‌లో ఉంచడం చట్ట విరుద్ధమన్నారు. ఎఫ్ఐఆర్ లేకుండా పోలీసులు విచారణ పేరుతో వేధించడం ఏమిటని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పి, వెంటనే ఆమె సెల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని గండిబాబ్జి డిమాండ్ చేశారు.