ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది శనివారంకి తీవ్ర వాయుగుండంగా ఆదివారంకి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని దింతో ఆదివారం నుంచి ఏపీలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు ఉన్నాయని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.