రాన్నున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ ఇన్చార్జి గౌతు శిరీష కోరారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ..... ఐదేళ్లలో రైతాంగానికి తీవ్రంగా మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి రైతుల ఘోష తగులుతుందన్నారు. మంత్రి అప్పలరాజు జీడిరైతులకు గిట్టుబాటు కల్పించలేకపో యారని వి మర్శించారు. శివారు భూములకు నాలుగేళ్లుగా వంశధార నీరు రాకపోవడంతో నియోజకవర్గంలో పంటలు ఎండిపోయాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూరాడ మోహనరావు, అర్సవెళ్లి ఉమామహేశ్వరరావు, లైశెట్టి భీమారావు, దాసరిజేజేరావు, కోడ రామన్న, దుర్గారావు, సాతుపల్లి కామేశ్వరరావు పాల్గొన్నారు.