బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రేపు తుపానుగా బలపడనుందని ఐఎండీ వెల్లడించింది. అనంతరం ఈ నెల 4న దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకుని, 5న ఉదయం నెల్లూరు–మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది.
దీంతో ఏపీ వ్యాప్తంగా శని, ఆది, సోమ, మంగళవారాల్లో విస్తారంగా వానలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.