ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాగానే మోడీ సర్కార్ బాదేసింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరను పెంచి…భారత్‌లో విమానాలకు వాడే ఏవియేషన్ టర్బైన్ ఇంధన (ఏటీఎఫ్) ధర 4.6 శాతం తగ్గించింది. ఇది ఒకే నెలలో రెండో తగ్గింపు కావటం గమనార్హం. అయితే వాణిజ్య వంట గ్యాస్ (ఎల్పీజీ) రేటు 19 కిలోల సిలిండర్‌కు 21 రూపాయలు పెరిగింది. గృహావసరాల ఎల్పీజీ ధర (14.2 కిలోల సిలిండర్‌పై)లో ఎలాంటి మార్పు లేదు. దాని ధర రూ. 903గా ఉన్నది.
చమురు సంస్థలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 21 మేర పెంచాయి. దీంతో దీని ప్రభావం హౌటళ్లు, రెస్టారెంట్లు వంటి వాటిపై పడనుంది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు దేశ రాజధానిలో రూ. 1,796.50గా, వాణిజ్య రాజధాని ముంబయిలో రూ. 1,749గా ఉన్నది.చమురు సంస్థలు సవరించిన ధరల ప్రకారం..విమాన ఇంధనం ఏటీఎఫ్ ధర రూ. 5,189.25 (4.6 శాతం) తగ్గింది. దేశ రాజధానిలో కిలోలీటర్‌కు రూ. 1,11,344.92 నుంచి రూ. 1,06,155.67కి తగ్గింది. నవంబర్ 1న జెట్ ఇంధనం ధర దాదాపు 6 శాతం (కిలోలీటర్‌కు రూ. 6,854.25) తగ్గింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో 40 శాతంగా ఉండే జెట్ ఇంధనం ధర తగ్గింపు, ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్‌లైన్స్‌పై భారాన్ని తగ్గించనున్నది.