సూర్యుని అధ్యయనం కోసం ప్రారంభించిన ఆదిత్య ఎల్1 మిషన్ దూసుకుపోతుంది. ఆ ఉపగ్రహంలో ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ పేలోడ్ సౌర గాలిపై అధ్యయనాన్ని ప్రారంభించింది.
ఈ మేరకు ఇస్రో నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం సోలార్ పేలోడ్ తన కార్యకలాపాలను సక్రమంగా నిర్వహిస్తోందని, స్పెక్ట్రోమీటర్ కూడా బాగా పనిచేస్తోందని ఇస్రో వెల్లడించింది. ఆదిత్య పేలోడ్ పరికరం ద్వారా తీసిన ఫోటోలను ఇస్రో ట్వీట్ చేసింది.