గజపతినగరంలోని శ్రీకృష్ణ డిగ్రీ కళాశాలలో శనివారం ఓటు హక్కు నమోదుపై జనసేన పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు (జగన్), ప్రిన్సిపాల్ రాంబాబు అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఈ మేరకు గ్రామంలో గల బిఎల్ఓ ను సంప్రదించాలన్నారు. సిబ్బంది నారాయణరావు పాల్గొన్నారు.