ఏపీలో బీసీలకు నిజమైన సాధికారత రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 'నిర్ణయాత్మక శక్తి ఉంటేనే అది సార్థకమవుతుంది. విధానాలు రూపొందించే అధికారం రావాలి.
బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు వారికే ఇవ్వాలి. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టా. అణగారిన కులాలకు. అధికారం చూడని కులాలకు సాధికారత రావాలి' అని పవన్ పేర్కొన్నారు.