సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం అంగన్వాడి కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం, గుచ్చిమి, మరడాం, పోరలి చామలవలస లలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు కార్యదర్శి పి. జ్యోతి, సెక్టార్ నాయకులు వాణి, ముత్యాలమ్మ, పద్మ పద్మకళ తెలిపారు. ఈనెల 8 నుంచి అంగన్వాడి కేంద్రాలకు తాళాలు వేయనున్నట్లు ప్రకటించారు.