నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక 6/1, 6/2, 7/3 పప్పుల వీధి, 9/1 కుసుమ హరిజన వాడ వార్డు సచివాలయాలను కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం తనిఖీ చేశారు. సచివాలయాలలోని ఇన్స్పెక్షన్ రిజిష్టరు, నోటీసు బోర్డు, హాజరు రిజిస్టర్, స్పందన రిజిష్టరులతో పాటు వివిధ సంక్షేమ పథకాల రికార్డులను పరిశీలించారు. పెండింగులో ఉన్న సేవలను గడువులోపు పూర్తి చేయాలని, సాంకేతిక అంశాలపై సూచనలు పొందాలని సూచించారు.