బంగ్లాదేశ్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. 5.6 తీవ్రతతో చిట్టగాంగ్‌లో భూ అంతర్భాగంలో 55 కి.మీ. లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
ఈ భూకంపం కారణంగా భారత్‌లోని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కోల్‌కతాతో సహా పలు ప్రాంతాల్లో ఒక్కసారి భూమి కంపించింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.