ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శనివారం మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పీఎల్‌జీఏ వారోత్సవాలను పురస్కరించుకుని భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని బర్సూర్‌పల్లి-మట్లాడ రహదారిపై మావోయిస్టులు బ్యానర్లు కట్టి, ఐఈడీలను అమర్చారు.
దీనిపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వారిని అక్కడి నుంచి తొలగించేందుకు సిద్ధమయ్యాయి. ఈఐడీ పేలడంతో సీఆర్పీఎఫ్ జవాన్లు అజయ్ సలాం, మణికంఠన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa