ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది రోమ్ నగరంలో మధ్యలో ఉంటుంది. అంతా కలిపి 0.19 చదరపు మైలు మాత్రమే. అంటే చిన్న పట్టణ కేంద్రంలా ఉంటుంది.
ఇక్కడ పర్మనెంట్‌గా ఉన్న వారు 800 మంది మాత్రమే. వీరిలో 450 మంది వాటికన్ సిటీ పౌరులు. ఇది చిన్న నగరమే కానీ.. ఏటా దీన్ని చూసేందుకు 50 లక్షల మంది దాకా పర్యాటకులు వస్తున్నారు. ఇక పోప్‌ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు.