మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి కౌంటింగ్ నిర్వహిస్తుండటంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫలితాల కోసం పెద్ద సంఖ్యలో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈసీ వెబ్‌సైట్‌పై విపరీతమైన లోడ్ పడింది.
దాని వల్ల వెబ్సైట్ క్రాష్ అయినట్టు తెలుస్తోంది. తమకు ఈసీ వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. దీంతో ఫలితాలు అప్డేట్ వెంటనే తెలియడం లేదని చెబుతున్నారు. ఉదయం 9 గంటలకు కూడా వెబ్సైట్ ఎలాంటి ట్రెండ్స్‌ను చూపలేదని యూజర్లు ఫిర్యాదు చేశారు. ఈ పోస్టులు ఎన్నికల సంఘం దృష్టి వచ్చాయి. దీంతో అధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.