ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి డిసెంబర్ 6 బుధవారం సమావేశం కానుందని కాంగ్రెస్ ఆదివారం ప్రకటించింది.
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో సమావేశం జరగనున్నట్లు తెలిపారు. మూడు నెలల క్రితం ప్రతిపక్ష కూటమి ఇండియా చివరి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.