తమిళనాడులో భారీవర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. మరో రెండురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది..చెన్నైతో పాటు అనేక జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. తిరువల్లూర్, కంచీపురం, చెంగల్పట్టు, చెన్నై, టెంకాశీ, తూతుకుడై, తిరునెల్వెలి, కన్యాకుమారి జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి,” అని ఐఎండీ ఓ ప్రకట విడుదల చేసింది. అలాగే పాటు విల్లుపురం, రాణిపేట్, కుద్దలూరు, తంజావూర్, నాగపట్టినమ్, మయియదుథురై, తిరువరూర్, రామానంతపురం, తిరుప్పుర్, దిండిగుల్, పుడుకొట్టై, విరుధునగర్, థెనితోపాటు పుదుచ్చేరి- కరైకల్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి..
ఈరోజు ముఖ్యంగా చెన్నై, కంచీపురం, రాణిపేట్, చెంగల్పట్టు, విల్లుపురం, కుద్దలూరు, మయిలదుథురై జిల్లాలు సహా పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.. ఈనెల 4 న మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.. తమిళనాడులో ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. కొన్ని చోట్ల స్కూళ్లు, కాలేజీలు ఇప్పట్లో తెరుచుకునే సూచనలు కనిపించడం లేదు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. బంగాళాఖాతం లోని ఏర్పడిన వాయుగుండం… ఆదివారం తుపాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆదివారం నాటికి తుఫాను మచిలీపట్నం సముద్ర తీరం దాటనున్నదని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. తెలంగాణాలో కూడా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు..