నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ కమలనాథుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. మూడు రాష్ట్రాల్లో విజయానికి బీజేపీ అత్యంత చేరువలో ఉండటం వారిని ఆనందంలో ముంచెత్తుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లలో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
మోదీ మ్యాజిక్కే ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు. ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం వరకూ వెల్లడించిన సమాచారం ప్రకారం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ఆధిక్యతలపరంగా లీడింగ్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లో దాదాపు గెలుపు ఖాయమైంది. రాజస్థాన్‌లో ఆధిక్యాల పరంగా మెజారిటీ మార్క్‌ను బీజేపీ దాటగా, కాంగ్రెస్ 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రధానిని ప్రశంసిస్తూ వరుస ట్వీట్లు చేశారు.