అమెరికాలో అతిపెద్ద రిటైల్ స్టోర్ల చైన్ కలిగి ఉన్న వాల్‌మార్ట్ చాలా కాలంగా భారత మార్కెట్ పై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెజాన్ ఇండియాతో పోటీ పడేందుకు ఫిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసింది.ప్రస్తుతం అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్ భారతదేశం నుంచి దాని దిగుమతులను గణనీయంగా పెంచుతోంది. కంపెనీ తన గ్లోబల్ సోర్సింగ్ వ్యూహంలో ప్రధాన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా నుంచి తన దిగుమతులను తగ్గించటం భారత మార్కెట్లకు అనుకూలమైన అంశంగా చెప్పుకోవచ్చు. వాల్‌మార్ట్ బలమైన లాజిస్టిక్స్ .. కేవలం ఒక్క సప్లయర్ పైనే ఎక్కువగా ఆధారపడుకుండా ఉండేందుకు భౌగోళికంగా తీసుకున్న ప్రణాళికలో భాగంగా తాజా మార్పులు చోటుచేసుకుంటున్నట్లు వాల్‌మార్ట్ సోర్సింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా ఆల్బ్రైట్ పేర్కొన్నారు.
భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ గణనీయమైన పెట్టుబడి, 2027 నాటికి ఇండియా నుంచి ఏడాదికి 10 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించటం మన మార్కెట్లపై వాల్‌మార్ట్ ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండియా నుంచి వాల్‌మార్ట్ దిగుమతులు ఏడాదికి 3 బిలియన్ డాలర్లుగా ఉంది.భారత ఆర్థిక దృక్పథం, సానుకూల మార్కెట్ సూచికలు, భారీ స్థాయిలో తక్కువ-ధర తయారీ సామర్థ్యాలు వాల్‌మార్ట్ ను ఆకర్షిస్తోంది. బొమ్మలు, ఎలక్ట్రానిక్స్, సైకిళ్లు, ఔషధాల వంటి సోర్సింగ్ ఉత్పత్తుల విషయంలో చైనాకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా ఇండియా మారటం షిఫ్ట్ వెనుక కీలకంగా నిలిచింది. అలాగే కంపెనీకి భారత ప్రభుత్వంతో మంచి రిలేషన్ పెంచుకుంటోంది. అలాగే వాల్‌మార్ట్ CEO భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పెట్టుబడి ప్రణాళికల గురించి చర్చిస్తున్నారు.