ప్రయాణికులు, సరకు రవాణా ద్వారా నవంబరులో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. గత నెలలో ప్రయాణికుల నుంచి రూ.469.40 కోట్లు, 11.57 మిలియన్ టన్నుల వస్తు రవాణా ద్వారా రూ.1,131.13 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించింది. నవంబరు నెలలో గతంలో ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత ఆదాయం రాలేదని జోన్ సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.