ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకున్న ఆ పార్టీ.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం వెలువడిన ఫలితాలను సరళి బట్టి ఆ పార్టీ మూడు రాష్ట్రాల్లోనూ మ్యాజిక్ మార్క్‌ను దాటేసింది. ఛత్తీస్‌గఢ్‌లో గెలుపు ఖాయమనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు ఊహించని షాకిచ్చారు. అటు మధ్యప్రదేశ్‌లోనూ గెలుపుపై భారీ ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీ అక్కడా చుక్కెదురయ్యింది. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కానీ, గ్వాలియర్ యువరాజు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కమలనాథ్ సర్కారు 14 నెలలకే కూలిపోయింది. దీంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ.. శివరాజ్ సింగ్ చౌహన్‌కు పగ్గాలను అప్పగించింది. ప్రస్తుతం ఎన్నికల్లో ఆ పార్టీ ఏకపక్ష విజయాన్ని అందుకునే దిశగా సాగుతోంది. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో బీజేపీ 159, కాంగ్రెస్ 67 చోట్ల.. ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
అటు, ఐదేళ్లకు ఒకసారి అధికారాన్ని మార్చే సంప్రదాయం రాజస్థాన్‌లో ఈసారి కూడా కొనసాగింది. మొత్తం 200 స్థానాలకు గానూ 199 సీట్లకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ ప్రస్తుతం 114 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 71 చోట్ల, బీఎస్పీ 3, ఇతరులు 11 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు, రెండు దశల్లో ఎన్నికలు జరిగిన ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలున్నాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ 54, కాంగ్రెస్ 35 స్థానాల్లోనూ, ితరులు ఒక చోట ముందంజలో ఉన్నారు.