మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు భారీగా రద్దయ్యాయి. విజయవాడ మీదుగా గ్రాండ్ మెయిన్ ట్రంక్ లైన్ మీద రాకపోకలు సాగించే రైళ్లను భారీ సంఖ్యలో రైల్వే శాఖ రద్దు చేసింది. శనివారం రాత్రి 7 గంటల సమయానికి మొత్తం 142 రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అలర్ట్ జారీ చేసింది. మిచాంగ్ తుపాన్ తీరాన్ని దాటనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) పరిధిలో 142 రైళ్లు రద్దు చేశామని సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రాకేశ్ తెలిపారు.
ఇందులో విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్‌లను కూడా రద్దు చేశారు. విజయవాడ నుంచి న్యూఢిల్లీ వెళ్లే దురంతో సూపర్‌ఫాస్ట్ కూడా రద్దయ్యింది. విజయవాడ-చెన్నై వెళ్లే పినాకిని రద్దయ్యింది. విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-సికింద్రాబాద్, విశాఖపట్నం-సికింద్రాబాద్, విజయవాడ-గూడూరు, నర్సాపూర్-కొట్టాయం, కాకినాడ టౌన్-తిరుపతితోపాటు సికింద్రాబాద్-విజయవాడ, లింగంపల్లి-విజయవాడ మధ్యన నడిచే అనేక రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ - విశాఖ, విజయవాడ-బెంగళూరు మధ్యన నడిచే రైళ్లు కూడా రద్దయ్యాయి. తుఫాన్ ప్రభావంతో రేణిగుంట విమానాశ్రయం నుంచి శనివారం పలు విమానాలు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యమయ్యాయి.
ఇవాళ.. భువనేశ్వర్-బెంగళూరు (12845), విశాఖ-తిరుపతి/కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (17488), తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ (22708), పూరి-చెన్నై (22859), టాటానగర్-ఎర్నాకులం (18189), సంత్రాగచ్చి-తిరుపతి (22855), గౌహతి-బెంగళూరు (12510), నాగర్‌కోయిల్-షాలిమర్ (12659), హటియా-బెంగళూరు (12835), హౌరా-చెన్నై మెయిల్ (12839), షాలిమార్-చెన్నై కోరమండల్ (12841), హౌరా-బెంగళూరు (12863), హౌరా-పాండిచ్చేరి (12867), ధన్‌బాద్-అలెప్పీ బొకారో (13351),
డిసెంబర్ 4 (సోమవారం)న బెంగళూరు-భువనేశ్వర్ (12846), కడప/తిరుపతి-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్ (17487), విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్ (22707), చెన్నై-పూరి (22860), విశాఖ-చెన్నై (22860), గుహవటి-బెంగళూరు (12510), హౌరా-చెన్నై మెయిల్ (12839), చెన్నై-హౌరా మెయిల్ (12840), షాలిమార్-చెన్నై కోరమండల్ (12841), చెన్నై-షాలిమార్ కోరమండల్ (12842), హౌరా-బెంగళూరు (12863), బెంగళూరు-హౌరా (12864), ధన్‌బాద్-అలెప్పీ బొకారో (13351), ముజాఫర్‌పూర్-బెంగళూరు (15228), తంబరం-సిలిఘాట్ (15629), ఎర్నాకులం-పాట్నా (22643), హటియా-ఎర్నాకులం (22837), సంత్రాగచ్చి-తంబరం (22841), తిరుపతి-సంత్రాగచ్చి (22856), హౌరా-బెంగళూరు (22863) రద్దు
డిసెంబర్ 5 (మంగళవారం)న విశాఖ-తిరుపతి/కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (17488), చెన్నై-విశాఖ (22870), బెంగళూరు-హౌరా (12246), బెంగళూరు-గౌహతి (12509), బెంగళూరు-హటియా (12836), చెన్నై-హౌరా మెయిల్ (12840), షాలిమార్-చెన్నై కోరమండల్ (12841), చెన్నై-షాలిమార్ కోరమండల్ (12842), ఎర్నాకులం-టాటానగర్ (18190), బెంగళూరు-హటియా (18638), విల్లుపురం-ఖరగ్‌పూర్ (22604) రద్దు. డిసెంబర్ 6 (బుధవారం)న కడప/తిరుపతి-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్ (17487), కోయంబత్తూర్-బరౌని (03358), బెంగళూరు-గౌహతి (12509), షాలిమార్-నాగర్‌కోరుల్ (12660), చెన్నై-హౌరా మెయిల్ (12842), పుదుచ్చేరి-హౌరా (12868), అలెప్పీ-ధన్‌బాద్ బొకారో (13352), కన్యాకుమారి-డిబ్రుగర్ (22503), ఎర్నాకులం-హటియా (22838), తంబరం-సంత్రాగచ్చి (22842), బెంగళూరు-హౌరా (22864) రద్దు. డిసెంబర్ 7 (గురువారం)న కన్యాకుమారి-డిబ్రుగర్ (22503), ఖరగ్‌పూర్-విల్లుపురం (22603), పాట్నా-ఎర్నాకులం (22643), బెంగళూరు-ముజాఫర్‌పూర్ (15227), అలెప్పీ-ధన్‌బాద్ బొకారో (13352) రద్దు. డిసెంబర్ 8న సిలిఘాట్-తంబరం (15630) రద్దు చేశారు.