తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం ఏపీపై తప్పక ప్రభావం చూపుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజకీయాల్లో అహంభావాన్ని ప్రజలు సహించరని, బీఆర్ఎస్ పార్టీకి అహంభావం ఎక్కువై ఓటమి చవిచూసిందన్నారు. ఇక కేసీఆర్ ను గెలిపించేందుకు జగన్ తీవ్రంగా శ్రమించారని, చివరికి నాగార్జునసాగర్ వద్దకు పోలీసులను పంపి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.