అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కె.వెంకటాపురంలో విషాదం చోటు చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక ఎస్బీఐ ఉద్యోగి సిహెచ్. హేమ అరుంధతి(36) పెదబొడ్డేపల్లి సమీపంలో శుక్రవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
నర్సీపట్నం ఎస్బీఐ(బజార్)లో పనిచేస్తున్న అరుంధతికి మూడేళ్ల బాబు ఉన్నాడు. ఈమె మొదటి భర్త చనిపోవడంతో రాజమండ్రికి చెందిన సహాంత్ను రెండో వివాహం చేసుకుంది.