సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 11న కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సమావేశం నిర్వహిస్తామని సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
కేబినెట్ లో చర్చించాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా పంపాలని అన్ని శాఖలను సీఎస్ ఆదేశించారు. విశాఖ నుంచి పరిపాలన, నవరత్నాల పథకాల అమలుకు ఆమోదం, ఇతర పలు అంశాలపై చర్చించనున్నారు.