మిచౌంగ్ తుపాను నేపథ్యంలో యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించినందున పాదయాత్రకు మూడు రోజుల విరామం ఇస్తున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు.
ప్రస్తుతం కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్దకు పాదయాత్ర చేరింది. ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కాగా ఈనెల 7న మళ్లీ శీలంవారిపాకల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.