విశాఖపట్నం జిల్లా కసింకోట మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జోగారావుపేట వద్ద శారదా నదిలో మునిగి ఇద్దరు మహిళలు మృతి చెందారు.
కార్తీక సోమవారం సందర్భంగా జోగారావుపేట గ్రామానికి చెందిన నలుగురు మహిళలు నదీ స్నానానికి వెళ్లారు. వారిలో అరట్ల మంగ (35), మారిపురెడ్డి లక్ష్మి (40) ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.