మిచాంగ్ తుపాను నేపథ్యంలో రైతులతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడారు. మిచాంగ్ తుపానుతో రైతులు ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధైర్యం చెప్పారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని మంత్రి పేర్కొన్నారు. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించుకోవాలని రైతులకు సూచించారు. ఏ మిల్లర్ అయినా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారని మంత్రి తెలిపారు. మిచాంగ్ తుపాను తీవ్రత తగ్గే వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.