దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 నాటికి సెన్సెక్స్ 215.30 పాయింట్లు పెరిగి 69,080.42 వద్ద, నిఫ్టీ 57.40 పాయింట్లు పెరిగి 20,744.20 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో BPCL, M&M, అపోలో హాస్పిటల్స్, ICICI బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి. HCL టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.38 వద్ద ఉంది.